Friday 16th October 2026
12:07:03 PM
Home > క్రీడలు > ‘టీం ఇండియా జెర్సీ పై పాకిస్తాన్ పేరు వద్దు’

‘టీం ఇండియా జెర్సీ పై పాకిస్తాన్ పేరు వద్దు’

Pakistan Name On Team India’s Jersey | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ( ICC Champions Trophy-2025 )లో భాగంగా ఇప్పటికే టీం ఇండియా మ్యాచుల వేదికపై పెద్ద ఎత్తున చర్చ జరిగిన విషయం తెల్సిందే.

తాజాగా జెర్సీ విషయంలో మరోసారి వివాదం చెలరేగింది. ఫిబ్రవరి 19నుండి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. పాకిస్తాన్ ( Pakistan ) దేశం ఈ మెగా ఈవెంట్ కు ఆతిధ్యం ఇస్తుంది.

భారత్ తన మ్యాచులను పాకిస్తాన్ లో ఆడబోదని బీసీసీఐ ( BCCI ) ఐసీసీకి స్పష్టం చేసింది. సుదీర్ఘ చర్చల అనంతరం దుబాయ్ వేదికగా టీం ఇండియా మ్యాచులు నిర్వహించడానికి ఐసీసీ ఏర్పాట్లు చేస్తోంది.

అయితే ఇప్పుడు టీం ఇండియా జెర్సీలపై ఆతిధ్య దేశం పాకిస్తాన్ పేరును ముద్రించేంది లేదని బీసీసీఐ తేల్చి చెప్పింది. ఆటగాళ్ల జెర్సీలపై ఆతిధ్య జట్టు పేరు ఉండడంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( Pakistan Cricket Board ) బీసీసీఐ విమర్శలు గుప్పించింది.

ఐసీసీ టోర్నమెంట్ కు సంబంధించిన లోగోను ప్రతీ జట్టు తమ జెర్సీపై ముద్రించాలని పీసీబీ పేర్కొంది. బీసీసీఐ అనవసరంగా క్రికెట్ లోకి రాజకీయాలను తీసుకువస్తుందని, దీని వల్ల ఆటకు తీవ్ర నష్టం కలుగుతోందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు విమర్శలు చేశారు.

తొలుత పాకిస్తాన్ కు టీంను పంపడానికి తిరస్కరించారు, ఇప్పుడేమో జెర్సీలపై పేరు వద్దంటున్నారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

You may also like
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ!
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions