Thursday 17th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > సైఫ్ అలీఖాన్ ఇంట్లో దొంగ..నటుడిపై కత్తితో దాడి

సైఫ్ అలీఖాన్ ఇంట్లో దొంగ..నటుడిపై కత్తితో దాడి

Saif Ali Khan News | బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై ఓ దుండగుడు కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ముంబైలోని నటుడి నివాసంలోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి యత్నించాడు.

ఇది గమనించిన సైఫ్ అలీఖాన్ అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో దుండగుడు నటుడిపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఈ ఘర్షణలో నటుడికి ఆరు చోట్ల కత్తి గాయాలయ్యాయి.

వెంటనే సైఫ్ అలీ ఖాన్ ను కుటుంబ సభ్యులు లీలావతి ఆసుపత్రికి తరలించారు. రెండు చోట్ల లోతైన గాయాలు అయినట్లు వైద్యులు గుర్తించారు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున రెండున్నర గంటలకు జరిగినట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు నటుడి నివాసానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దుండగుడిని పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions