Friday 20th March 2026
12:07:03 PM
Home > తాజా > హీరోయిన్ ను పెళ్లి చేసుకున్నటాలీవుడ్ దర్శకుడు!

హీరోయిన్ ను పెళ్లి చేసుకున్నటాలీవుడ్ దర్శకుడు!

sandeep raj marries chandini rao

Sandeep Raj Marries Chandini Rao | కలర్ ఫోటో (Colour Photo) సినిమాతో విమర్శలకు ప్రశంసలు అందుకున్న టాలీవుడ్ దర్శకుడు సందీప్ రాజ్ (Sandeep Raj), హీరోయిన్ చాందీనీ రావు (Chandini Rao) పెళ్లి చేసుకున్నారు.

తిరుమలలో వీరి వివాహం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో సందీప్ రాజ్, చాందీనీ మెడలో మూడు ముళ్లు వేశారు. ఈ వేడుకు కలర్ ఫోటోలో నటించిన హీరో సుహాస్ (Suhas), నటుడు వైవా హర్ష (Viva Harsha) తదితురులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

సందీప్ రాజ్ తొలి చిత్రం కలర్ ఫోటో సినిమాలో చాందినీ రావు కీలక పాత్ర పోషించారు. ఆ చిత్రంతో వీరి పరిచయం ప్రేమగా మారింది. వీరి ప్రేమకు పెద్దలు కూడా అంగీకారం తెలపడంతో శనివారం మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

సందీప్ రాజ్ ప్రస్తుతం రాజీవ్ కనకాల (Rajeev Kanakala) కుమారుడు రోషన్ హీరోగా  ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
rajendra prasad
క్షమాపణలు చెప్పండి.. ఇంతటితో ముగించండి!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions