Tuesday 11th August 2026
12:07:03 PM
Home > తాజా > పుష్ప 2: తొక్కిసలాటలో మహిళ మృతి.. స్పందించిన అల్లు అర్జున్ టీం!

పుష్ప 2: తొక్కిసలాటలో మహిళ మృతి.. స్పందించిన అల్లు అర్జున్ టీం!

allu arjun

Allu Arjun Team | అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ‘పుష్ప ది రూల్’ (Pushpa 2) ప్రీమియర్ షోలో భాగంగా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద బుధవారం రాత్రి తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.

బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో థియేటర్ కు వచ్చిన హీరో అల్లు అర్జున్ ను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందారు.

ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై తాజాగా అల్లు అర్జున్ టీమ్ స్పందించింది. ఇది నిజంగా దురదృష్టకరమని విచారం వ్యక్తం చేసింది.

“నిన్న రాత్రి సంధ్య థియేటర్లో జరిగిన ఘటన నిజంగా దురదృష్టకరం. ప్రస్తుతం బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మా బృందం ఆ కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందజేస్తాం” అని తెలిపింది.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
సోషల్ మీడియా ట్రోల్స్‌పై అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు..!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions