Wednesday 18th March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > షాకింగ్ ఘటన.. మాప్స్ ని ఫాలోఅవుతూ బ్రిడ్జ్ నుంచి పడిపోయిన కారు!

షాకింగ్ ఘటన.. మాప్స్ ని ఫాలోఅవుతూ బ్రిడ్జ్ నుంచి పడిపోయిన కారు!

A car fell from a bridge | ఉత్తర్ ప్రదేశ్ లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తెలియని కొత్త ప్రదేశానికి గూగుల్ మాప్స్ ను ఫాలో అవుతు వెళ్ళిన ఓ కార్ బ్రిడ్జ్ మీద నుంచి పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు స్నేహితులు అక్కడిక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. వివేక్, అమిత్ అనే ఇద్దరు యువకులు తమ స్నేహితుడి వివాహానికి హాజరయ్యేందుకు శనివారం గురుగ్రామ్ నుండి బరేలీ జిల్లాలోని ఓ ప్రాంతానికి ప్రయాణమయ్యారు. కొత్త ప్రదేశం కావడంతో GPS ఫాలో అవుతూ వెళ్లారు. ఇదిలా ఉండగా, బరేలీ జిల్లాలో రామ్ గంగా నదిపై అసంపూర్తిగా నిర్మించిన బ్రిడ్జి పై 50 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయింది. నదిలో నీరు లేకపోవడంతో కారు నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు. స్థానికులు మరుసటి రోజు ఉదయం ధ్వంసమైన కారును, మరణించిన ముగ్గురు వ్యక్తులను గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కానప్పుడు ఒక చివర బారికేడ్లు ఎందుకు ఏర్పాటు చేయలేదనీ, నిర్లక్ష్యానికి పాల్పడిన నిర్మాణ శాఖపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని కోరారు.

You may also like
నిజాయతీలో మా పిల్లలు బంగారం.. విద్యార్థినులపై మంత్రి లోకేశ్ ప్రశంసలు!
ssc hall tickes on whatsapp
WhatsApp ద్వారా SSC హాల్ టికెట్స్.. డౌన్ లోడ్ చేసుకోండిలా!
జగన్ పై టీటీడీ ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు!
Iran warship hit by USA
WW-II తర్వాత అతిపెద్ద దాడి.. విశాఖ నుంచి వెళ్తున్న ఇరాన్ నౌకపై..

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions