Friday 25th September 2026
12:07:03 PM
Home > తాజా > ఇచ్చిన మాటకోసం.. అయ్యప్ప మాలలో దర్గాకు వెళ్లిన రాంచరణ్

ఇచ్చిన మాటకోసం.. అయ్యప్ప మాలలో దర్గాకు వెళ్లిన రాంచరణ్

Ram Charan Visits Kadapa Dargah | గ్లోబల్ స్టార్ రాంచరణ్ ( Global Star Ram Charan ) సోమవారం సాయంత్రం కడప దర్గాకు వెళ్లారు. ఈ సందర్భంగా 80వ నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్ లో పాల్గొని దర్గాలో ప్రత్యేక ప్రార్ధన చేశారు.

కాగా అయ్యప్ప మాలలో ఉన్న రాంచరణ్ దర్గాకు వెళ్లడం పట్ల ఫ్యాన్స్ ( Fans ) హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజమైన సెక్యులరిజం అంటే ఇదే అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. కాగా మాలలో ఉన్న సమయంలో రాంచరణ్ దర్గాకు వెళ్లడం వెనుక ఓ కారణం ఉంది.

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్ ( AR Rahman ) కు ఇచ్చిన మాట కోసం గ్లోబల్ స్టార్ దర్గాకు వెళ్లారు. కడప దర్గా ఉత్సవాలకు వెళ్లాలని రెహమాన్ సూచించినట్లు, ఆయనకు ఇచ్చిన మాట ప్రకారం దర్గాకు వచ్చినట్లు రాంచరణ్ పేర్కొన్నారు.

నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్ లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని ఈ సందర్భంగా రాంచరణ్ తెలిపారు. అలాగే తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi ) కూడా అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి ప్రార్ధనలు చేస్తారని చెప్పారు. ఇదిలా ఉండగా రాంచరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో వస్తున్న మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్న విషయం తెల్సిందే.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions