Thursday 30th April 2026
12:07:03 PM
Home > తాజా > కాళేశ్వరం లేకున్నా రికార్డు స్థాయిలో వరి ధాన్యం

కాళేశ్వరం లేకున్నా రికార్డు స్థాయిలో వరి ధాన్యం

Cm Revanth On Kaleshwaram Project | కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు రికార్డు స్థాయిలో పెరిగిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మునుపెన్నడూ లేని విదంగా వానాకాలంలో అత్యధికంగా 66.77 లక్షల ఎకరాల్లో వారి సాగాయినట్లు సీఎం పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

‘ కాళేశ్వరం వల్లే తెలంగాణలో వరి సాగు పెరిగిందన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైంది. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ కుంగి… నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోయినా…ఎన్డీఎస్ఎ సూచన మేరకు అన్నారం, సుందిళ్లలోనీటిని నిల్వ చేయకపోయినా…
కాళేశ్వరంతో సంబంధం లేకుండా తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో వరిధాన్యం పండింది. ఇది తెలంగాణ రైతుల ఘనత…వారి శ్రమ, చెమట, కష్టం ఫలితంతెలంగాణ రైతు దేశానికే గర్వకారణం…ఈ ఘనత సాధించిన ప్రతి రైతు సోదరుడికి హృదయపూర్వక అభినందనలు.’ అంటూ ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
cm revanth reddy
తెలంగాణ DNAలోనే టెక్స్‌టైల్ ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!
tg cabinet meeting
తల్లిదండ్రులను చూడని ఉద్యోగులకు షాక్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions