Wednesday 11th February 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ప్రధాని మోదీ మాకు డిమాండింగ్ బాస్..కేంద్రమంత్రి కామెంట్స్ వైరల్

ప్రధాని మోదీ మాకు డిమాండింగ్ బాస్..కేంద్రమంత్రి కామెంట్స్ వైరల్

Pm Modi Is Demanding Boss | దేశ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ ( Jaishankar ) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ తమ డిమాండింగ్ బాస్ ( Demanding Boss ) అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ప్రధానితో భేటీ అంటే మంత్రులు కచ్చితమైన డేటాతో వెళ్లాల్సిందేనని చెప్పారు. అలాగే ఉక్రెయిన్-రష్యా ( Ukraine-Russia ) యుద్ధంలో భారత విద్యార్థులను రక్షించడానికి ప్రధాని మోదీ ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు.

ఈ మేరకు ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి జై శంకర్ పాల్గొన్నారు. నిత్యం మంత్రులు ప్రధానిని కలుస్తారు, ఆయనతో చర్చించే అంశాలపై మంత్రులు పక్కా సమాచారంతో వెళ్తారని తెలిపారు. ఎందుకంటే ప్రధానికి చర్చించే అంశంపై పూర్తి అవగాహన ఉంటుందన్నారు.

మోదీ నిజాయితీ గల వ్యక్తి అని, పీఎంతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని కేంద్రమంత్రి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కారణాల మూలంగా ప్రధాని మోదీ తమ డిమాండింగ్ బాస్ అంటూ అభివర్ణించారు.

You may also like
vc sajjanar
మీట్ యువర్ సీపీ.. హైదరాబాద్ కొత్వాల్ సజ్జనర్ సరికొత్త కార్యక్రమం!
gaddam prasad kumar
పార్టీ ఫిరాయింపులపై మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్!
ఇలాంటి ఫిబ్రవరి మళ్లీ 823 ఏళ్ల తర్వాత?
మోదీతో ఫోన్ కాల్..ట్రంప్ గుడ్ న్యూస్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions