Monday 17th March 2025
12:07:03 PM
Home > క్రైమ్ > షారుఖ్ ను చంపేస్తామని బెదిరింపు..నిందితుడి కోసం వెళ్లిన పోలీసులు

షారుఖ్ ను చంపేస్తామని బెదిరింపు..నిందితుడి కోసం వెళ్లిన పోలీసులు

Threats For Shahrukh Khan | బాలీవుడ్ ( Bollywood ) స్టార్ నటుడు షారుఖ్ ఖాన్ ( Shahrukh Khan ) ను చంపేస్తాం అంటూ గత కొన్ని రోజులు క్రితం బెదిరింపులు వచ్చిన విషయం తెల్సిందే. రూ.50 లక్షలు ఇవ్వకపోతే, షా రూఖ్ ఖాన్ ను చంపేస్తాం అంటూ ముంబై పోలీసులకు బెదిరింపులు వచ్చాయి.

ఈ క్రమంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఛత్తీస్ ఘడ్ లోని రాయపూర్ కు చెందిన ఫైజల్ ఖాన్ ను నిందితుడిగా గుర్తించారు. ఫోన్ చేసిన నంబర్ ఫైజల్ ఖాన్ పేరుపై నమోదయినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఈ క్రమంలో నిందితుడి కోసం రాయపూర్ కు ముంబై పోలీసులు వెళ్లారు. మంగళవారం ఫైజల్ ఖాన్ ను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా గతేడాది అక్టోబర్ లో కూడా షారుఖ్ కు బెదిరింపులు వచ్చాయి.

అలాగే ఇప్పటికే బాలీవుడ్ మరో స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ ( Salman Khan ) ను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ చేసుకున్న విషయం తెల్సిందే.

You may also like
‘యూట్యూబర్ హర్షసాయి నీకు బుద్ధి ఉందా’
‘ఏయ్ పోలీస్! పాటకు డాన్స్ చెయ్ లేదంటే సస్పెండ్’
‘హిందీ వివాదం..పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన’
హిందీ గో బ్యాక్..పవన్ గత వ్యాఖ్యల్ని గుర్తుచేసిన స్టాలిన్ సోదరి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions