Monday 3rd August 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ఆయన మాటలు ఏ క్రిస్టియన్ కి ఏ ముస్లింకి బాధ కలిగించవు: నాగబాబు

ఆయన మాటలు ఏ క్రిస్టియన్ కి ఏ ముస్లింకి బాధ కలిగించవు: నాగబాబు

naga babu

NagaBabu Tweet | సనాతన ధర్మానికి సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు ఆయన సోదరుడు నాగబాబు.

ఈ మేరకు పవన్ కు మద్దతుగా మరో ట్వీట్ చేశారు. “నీ మతంతో పాటు సాటి మతాలని గౌరవించు, రక్షించు అని ‌సమానత్వాన్ని చాటిందే సనాతన ధర్మం. ఆ ధర్మాన్నే పాటిస్తాడు పవన్ కళ్యాణ్.

ఎన్నో మీటింగ్స్ ఉదృత స్థాయి లో జరుగుతున్నపుడు మస్జిద్ నుంచి అజాన్ వస్తే తన స్పీచ్ ని అజాన్ పూర్తయే దాక ఆపేసి నిశ్శబ్దం పాటిస్తాడు పవన్ కళ్యాణ్ అది పర మతానికి అతనిచ్చే గౌరవం, మర్యాద.

పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని హిందువులు మాత్రమే కాదు, క్రైస్తవులు, ముస్లింలు కూడ ప్రేమిస్తారు.. అతను మతఛాందస్స వాది కాదు హిందు మతాన్ని గౌరవించాలి హిందు ఆచారాలని రక్షించాలని పాటుపడేవాడు. హిందు మత ధర్మ పరిరక్షణ లో ఆయన పోరాటం క్రైస్తవుల మీద, ముస్లింల మీద కాదు.

హిందు ధర్మం లో ఉంటూ హిందు ధర్మాన్ని చులకన చేస్తూ సెక్యులర్ వాదులం అని చెప్పుకునే సూడో సెక్యులర్ వాదులను చెంపపెట్టి కొట్టడానకి. హిందూ మతం పట్ల ఉదాసిన వైకరి అవలంబిస్తున్న కొంతమందిని తిరిగి గౌరవించరా నీ సనాతన ధర్మాన్ని అని చెప్పే నాయకుడు పవన్ కళ్యాణ్.

తన Administration లో ప్రతి మతం ప్రశాంతంగానే ఉంటుంది. పవన్ కళ్యాణ్ మాటలు సూడో సెక్యులర్ వాదులకి తప్ప ఏ క్రిస్టియన్ కి ఏ ముస్లిం కి బాధ కలిగించవు.. అర్ధం చేస్కోగలరు’ అని పోస్ట్ చేశారు నాగబాబు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
ప్రాణాలు పోతాయని తెలిసినా బిడ్డకు జన్మనిచ్చి..!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions