Sunday 20th April 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > పవన్ ని టార్గెట్ చేస్తూ ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్!

పవన్ ని టార్గెట్ చేస్తూ ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్!

prakashraj

Prakash Raj Tweet On Pawan | తిరుమల లడ్డూ వివాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. ఇటీవల తిరుమల లడ్డూ వివాదంలో పవన్ కళ్యాణ్ ప్రకాశ్ రాజ్ ను ఉద్దేశించి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

హిందూ సనాతన ధర్మం గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. దీనికి కౌంటర్ గా ప్రకాశ్ రాజ్ తాను ట్వీట్ చేసిం దేంటి.?మీరు మాట్లాడేదేంటి.? మరోసారి నా ట్వీ ట్ చదువుకోవాలని ఓ వీడియోరిలీజ్ చేశారు.

అనంతరం నటుడు కార్తీ (Karti) పవన్ కళ్యాణ్ కు క్షమాపణ చెప్పిన విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ చేయని తప్పు కి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్ ఆస్కింగ్ అంటూ బుధవారం ట్వీట్ చేశారు. తాజాగా మరోసారి పవన్ టార్గెట్ గా ఇంకో ట్వీట్ చేశారు.

గెలిచేముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఏందుకు మనకీ అయోమయం.. ఏది నిజం ? అంటూ ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

You may also like
‘పెళ్లికూరుతు స్థానంలో ఆమె తల్లి..షాకయిన వరుడు’
‘పిఠాపురంలో దళితులపై గ్రామ బహిష్కరణ’
‘మీ ఆప్యాయతతో నా మనసు ఉప్పొంగింది’
‘ముద్దిస్తావ అన్నాడు..ఎదురైన ఘటనను చెప్పిన నటి మాళవికా’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions