Friday 1st May 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > స్వామివారి దగ్గర ఇలా జరగడం పాపం, ఘోరాతి ఘోరం

స్వామివారి దగ్గర ఇలా జరగడం పాపం, ఘోరాతి ఘోరం

Mohan Babu On Tirumala Laddu Controversy | తిరుమల ( Tirumala ) శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి అంశం తీవ్ర ప్రకంపనలు సృస్తిస్తోంది.

ఈ క్రమంలో ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు ( Manchu Mohan Babu ) ఈ అంశంపై స్పందించి, కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి హిందూ పూజించే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి.

ఆ దైవానికి నిత్యం సమర్పించే లడ్డూలలో కలిపే ఆవు నెయ్యిలో దాదాపు 3 నెలల క్రితం వరకు ఇతర జంతువుల కొవ్వుని కలుపుతున్నారని తెలియగానే ఒక భక్తుడిగా తల్లడిల్లిపోయాను, తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను.

నిత్యం మా మోహన్ బాబు విశ్వవిద్యాలయం నుంచి కన్పించే తిరుమల క్షేత్రాన్ని చూసి నాతోపాటు వేలాదిమంది ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్ధులు, నిత్యం భక్తిపూర్వకంగా నమస్కరించుకుంటూ ఉంటాం.

ఆ స్వామి దగ్గర ఇలా జరగడం ఘోరం, పాపం, ఘోరాతి ఘోరం, నికృష్టం, అతినీచం, హేయం, అరాచకం. ఇదేగాని నిజమైతే నేరస్థులను శిక్షించాలని నా ఆత్మీయుడు, నా మిత్రుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ( Cm Chandrababu )ని హృదయపూర్వకంగా కోరుకుంటూ… ఈ కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు నా మిత్రుడు అందుకుని నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. ‘ అని మోహన్ బాబు పేర్కొన్నారు.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions