Thursday 19th March 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ఓకే శివయ్య..తిరుమల లడ్డూపై మంచు విష్ణు vs ప్రకాశ్ రాజ్

ఓకే శివయ్య..తిరుమల లడ్డూపై మంచు విష్ణు vs ప్రకాశ్ రాజ్

Manchu Vishnu vs Prakash Raj | తిరుమల ( Tirumala ) లడ్డూలో కల్తీ నెయ్యిని వినియోగించారనే అంశంపై ప్రముఖ నటులు మంచు విష్ణు ( Manchu Vishnu )మరియు ప్రకాష్ రాజ్ ( Prakash Raj ) ల మధ్య జోరుగా చర్చ నడుస్తోంది.

తొలుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Deputy Pawan Kalyan ) పోస్ట్ పై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ మతపరమైన ఉద్రిక్తతలను వ్యాప్తి చేయకూడదని సూచించారు. దీనిపై మంచు విష్ణు స్పందిస్తూ సంయవనం పాటించాలని ప్రకాష్ రాజ్ కు సూచించారు.

తిరుమల లడ్డూ కేవలం ప్రసాదం మాత్రమే కాదని అది కోట్లాది హిందువుల నమ్మకానికి ప్రతీక అని మంచు విష్ణు చెప్పారు.

హిందువుల మనోభావాల దృష్ట్యా పవన్ కళ్యాణ్ కేవలం విచారణకు సంబంధించి మాత్రమే వ్యాఖ్యానించారని ఇందులో ఎటువంటి మత ఉద్రిక్తతల అంశం లేదని పేర్కొన్నారు.

మంచు విష్ణు పోస్ట్ ( Post ) పై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ..’ఓకే శివయ్య..మీ దృష్టికోణం మీకు ఉంటుంది, నా కోణం నాకు ఉంటుంది’ అని జవాబిచ్చారు. కాగా మా ఎన్నికల సమయంలో వీరిద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్న విషయం తెల్సిందే.

You may also like
ఇరాన్ దాడులు..చిక్కుకున్న పీవీ సింధు, మంచు విష్ణు
కన్నప్ప టీంకు మంచు మనోజ్ ఆల్ ది బెస్ట్..కానీ !
మోహన్ బాబుకు బిగ్ రిలీఫ్
పెదరాయుడు తరహాలో మోహన్ బాబు..వీడియో వైరల్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions