Monday 3rd August 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘దేవర’ రిలీజ్ వరకైనా నన్ను బతికించండి.. ఎన్టీఆర్ అభిమాని చివరి కోరిక!

‘దేవర’ రిలీజ్ వరకైనా నన్ను బతికించండి.. ఎన్టీఆర్ అభిమాని చివరి కోరిక!

devara

NTR Fan Last Wish | దేవర (Devara) మూవీ చూసేంతవరకైనా తనను బ్రతికించడని ఓ క్యాన్సర్ పేషేంట్ డాక్టర్లను కోరుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన 19 ఏళ్ల కౌశిక్ (Kaushik) బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. టీటీడీ కాంట్రాక్ట్ డ్రైవర్ అయిన కౌశిక్ జూనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని.

ఈ క్రమంలో దేవర సినిమా చూసేంతవరకైనా తనను బ్రతికించాలని కోరుతున్నాడు. ఇదే విషయాన్ని కౌశిక్ తల్లి మీడియాతో వెల్లడించారు. ఈ మేరకు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా తో మాట్లాడారు. తన కుమారుడు చిన్నప్పటి నుండే ఎన్టీఆర్ కు వీరభిమానని, ఇప్పుడు కూడా దేవర సినిమా రిలీజ్ వరకు తనను బ్రతికించాలని కోరుతున్నట్లు ఆమె ఆవేదన చెందారు.

సెప్టెంబర్ 27 వరకు బ్రతికించాలని డాక్టర్లను వేడుకుంటున్నట్లు తల్లి పేర్కొన్నారు. తన కుమారుడి వైద్యానికి రూ.60 లక్షలు అవుతాయని దాతలు, ప్రభుత్వం ఆదుకోవాలని తల్లి కన్నీటి పర్యంతం అయ్యారు.

You may also like
సోషల్ మీడియా ట్రోల్స్‌పై అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు..!
ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల గోల.. డీజీపీకి రఘురామ కృష్ణంరాజు లేఖ!
rajendra prasad
క్షమాపణలు చెప్పండి.. ఇంతటితో ముగించండి!
pramodh shetty
రష్మిక తన పెళ్లికి మమ్మల్నిపిలవదని తెలుసు: ప్రమోద్ శెట్టి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions