Friday 18th September 2026
12:07:03 PM
Home > తాజా > బస్టాండ్ లో గర్భిణికి ప్రసవం చేసిన ఆర్టీసీ సిబ్బంది!

బస్టాండ్ లో గర్భిణికి ప్రసవం చేసిన ఆర్టీసీ సిబ్బంది!

karimnagar women

Karimnagar | కరీంనగర్ లోని ఆర్టీసీ బస్టాండ్ లో పురిటి నొప్పులు వచ్చిన మహిళకు అక్కడి సిబ్బంది ప్రసవం చేశారు. మానవత్వం పరిమళించిన ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే ఒడిషాకు చెందిన కుమారి-దూల దంపతులు పెద్దపల్లి, సుల్తానాబాద్ వద్ద ఇటుకల బట్టిలో పనిచేస్తున్నారు. కుమారి 9 నెలల నిండు గర్భిణీ. ఈ క్రమంలో వారి స్వస్థలానికి వెళ్లేందుకు దంపతులు కరీంనగర్ బస్టాండ్ కు చేరుకున్నారు.

అయితే కుమారికి నొప్పులు ప్రారంభం అయ్యాయి. వెంటనే భార్యను చెట్టు కింద పడుకోబెట్టిన భర్త, ఆ తర్వాత ఆర్టీసీ సిబ్బంది వద్దకు వెళ్లి సహాయం కోరారు. ఇంతలోనే మహిళకు పురిటి నొప్పులు పెరగడంతో బస్టాండ్ లో పనిచేసే స్వీపర్లు, సూపర్ వైజర్, ఆర్టీసీ సిబ్బంది చీరలను అడ్డుగా కట్టి కుమారికి ప్రసవం చేశారు.

అనంతరం అంబులెన్స్ లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లీ, బిడ్డా ఇద్దరు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. కాగా  కుమారికి పురుడుపోసిన ఆర్టీసీ స్వీపర్లు సైదమ్మ, స్రవంతి, లావణ్య, భవానీ, రేణుకను అధికారులు, ప్రయాణికులు అభినందించారు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
modi civic satyagraha call
బీ అలెర్ట్.. ప్రధాని మోదీ ‘సివిక్ సత్యాగ్రహం’ పిలుపు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions