Thursday 30th April 2026
12:07:03 PM
Home > తాజా > సీఎం ను కలిసిన బీఆరెస్ ఎమ్మెల్యే.. చేరిక ఖాయమే(నా)!

సీఎం ను కలిసిన బీఆరెస్ ఎమ్మెల్యే.. చేరిక ఖాయమే(నా)!

brs mla prakash goud

BRS MLA Meets CM | రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ (MLA Prakash Goud) బీఆరెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో భేటీ అయ్యారు. దీంతో త్వరలో కాంగ్రెస్ లో చేరుతానని ప్రకాష్ గౌడ్ సీఎం కు చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది.

అనుచరులతో కలిసి మరో రెండు రోజుల్లో హస్తం పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీఆరెస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్ కాంగ్రెస్ లో చేరిన విషయం తెల్సిందే.

ఇదిలా ఉండగా గురువారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన బీఆరెస్ సమావేశంలో మాజీ సీఎం, ఆ పార్టీ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఒక సీనియర్ నేత 20 మంది ఎమ్మెల్యేలతో బీఆరెస్ లోకి వస్తానని చెప్పినట్లు తెలిపారు. అంతేకాకుండా భవిష్యత్ బీఆరెస్ దే నని, 64 మంది ఎమ్మెల్యేలే ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ బ్రతకనిస్తుందా అని అనుమానం వ్యక్తం చేశారు. అయితే కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా నేతలు పార్టీని వీడడం ఆసక్తిగా మారింది.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
cm revanth reddy
తెలంగాణ DNAలోనే టెక్స్‌టైల్ ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!
tg cabinet meeting
తల్లిదండ్రులను చూడని ఉద్యోగులకు షాక్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions