Monday 3rd August 2026
12:07:03 PM
Home > తాజా > ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన సీఎం రేవంత్ రెడ్డి!

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన సీఎం రేవంత్ రెడ్డి!

cm revanth

Revanth Takes Oath As MLA | ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ అధ్యక్షతన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం ఉదయం 11 గంటల నుండి ప్రారంభం అయ్యాయి. అంతకంటే ముందు ప్రొటెం స్పీకర్ గా రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు ఎంఐఎం కు చెందిన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ.

గవర్నర్ తమిళసై అక్బరుద్దీన్ ఒవైసీ చేత ప్రమాణ స్వీకారం చేయించగా, ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రొటెం స్పీకర్ అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించగా, తొలుత సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే గా ప్రమాణ స్వీకారం చేశారు.

ఆయన తర్వాత మధిర ఎమ్మెల్యే, డెప్యూటి సీఎం భట్టి విక్రమార్క ప్రమాణం చేశారు. ఆ తర్వాత నూతనంగా ఎంపికైన మంత్రులందరూ ప్రమాణం చేశారు. వీరి ప్రమాణం చేశాక మిగిలిన ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. కాగా శాస్త్ర చికిత్స కారణంగా మాజీ సీఎం, గజ్వెల్ ఎమ్మెల్యే కేసీఆర్ శాసనసభ సమావేశాలకు దూరంగా ఉన్నారు.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
తెలంగాణలో వారికి కూడా పెన్షన్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions