Friday 20th March 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలని కోరుకున్నా’

‘తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలని కోరుకున్నా’

cbn
  • తిరుమలలో టీడీపీ అధినేత చంద్రబాబు..!

Chandra Babu Visits Tirumala | ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandra babu naidu) శుక్రవారం ఉదయం సతీసమేతంగా తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్థ, ప్రసాదాలు అందించారు అర్చకులు.

దర్శన అనంతరం మీడియా తో మాట్లాడిన చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను వేంకటేశ్వరుడి పాద పద్మాల చెంత పుట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నట్లు తెలిపారు.

2003 లో మావోయిస్టులు దాడి చేసినప్పుడు సాక్షాత్తు వేంకటేశ్వరుడే తనకు ప్రాణ భిక్ష పెట్టినట్లు పేర్కొన్నారు.

అందుకే ఇటీవల తనకు కష్టం వచ్చినప్పుడు కూడా స్వామి వారిని మొక్కుకున్నానీ, ఆ మొక్కు తీర్చుకోవడానికి తిరుమల వచ్చానని చెప్పారు చంద్రబాబు.

ప్రపంచంలో దేశం అగ్రస్థానంలో ఉండాలని, తెలుగు జాతి నంబర్ 1 గా ఉండలాని కోరుకున్నట్లు స్పష్టం చేశారు.

ప్రజలకు సేవ చేసే శక్తి, సామర్ధ్యాలు తనకు ఇవ్వాలని స్వామి వారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం చేశారు చంద్రబాబు.

You may also like
man hulchal in tirumala
తిరుపతిలో అపచారం.. ఆలయ గోపురంఎక్కి మందు బాబు హల్చల్!
ttd
అది అసత్య ప్రచారం.. నమొద్దు.. భక్తులకు టీటీడీ కీలక సూచన!
ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
adr releases assets of chief ministers in india
దేశంలో రిచెస్ట్ సీఎం ఎవరో తెలుసా..!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions