Monday 14th September 2026
12:07:03 PM
Home > తాజా > రైతులకు శుభవార్త.. రైతు బంధుకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్!

రైతులకు శుభవార్త.. రైతు బంధుకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్!

Rythu bandhu

Rythu Bandhu | తెలంగాణ అసెంబీ ఎన్నికలకు ముందు రైతులకు శుభవార్త చెప్పింది ఎన్నికల సంఘం.

పంట పెట్టుబడి సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతుబంధు పథకం నిధుల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది.

ఈ మేరకు రాష్ట్ర సిఇఒ కార్యాలయం అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతు బంధు నిధుల పంపిణీకి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ఏర్పాట్లు చేసింది.

ఈ నెల 28 లోపు రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయడానికి ఆర్థిక శాఖ ఏర్పాట్లు చేసింది. ఎకరానికి రూ. 5వేల చొప్పున రూ. 65 లక్షల మంది  రైతుల అకౌంట్లో రైతు బంధు నగదు జమ కానుంది.

దాదాపు రూ. 7500కోట్లు జమ చేయనుంది తెలంగాణ సర్కార్. ఈ సారి పోడు భూముల రైతులకు కూడా రైతు బంధు అందనుంది.

You may also like
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!
తస్మాత్ జాగ్రత్త.. సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ!
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions