Thursday 30th April 2026
12:07:03 PM
Home > తాజా > ‘పవన్ ఆలోచన చేయాలి..’ జనసేనానికి వీహెచ్ కీలక సూచనలు!

‘పవన్ ఆలోచన చేయాలి..’ జనసేనానికి వీహెచ్ కీలక సూచనలు!

v hanumanth rao

V Hanumantha Rao | కాంగ్రెస్ నేతలపై జరుగుతున్న ఈడీ, ఐటీ దాడులపై స్పందించారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు.

ఈ మేరకు శనివారం గాంధీభవన్ లో మీడియా తో మాట్లాడిన ఆయన తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు ఇలాంటి దాడులు చూడలేదని తెలిపారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా పనిగట్టుకొని ఈ దాడులు చెపిస్తున్నారని ధ్వజమెత్తారు.

కేవలం కాంగ్రెస్ నేతలపై మాత్రమే ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు జరుగుతున్నాయని, బీజేపీ, బీఆరెస్ పార్టీల్లో దాడులు జరగడం లేదన్నారు విహేచ్. బీఆరెస్, బీజేపీల్లో డబ్బులు ఉన్న వారు లేరా అని ప్రశ్నించారు.

రాహుల్ గాంధీ బీసీ కుల గణన చేస్తామన్నప్పటి నుండి మోదీ జై బీసీ నినాదం ఎత్తుకున్నారాని విమర్శించారు.

అలాగే బీజేపీ జనసేన పొత్తు పై మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆలోచన చేయాలని, విశాఖ స్టీల్ ప్లాంట్, స్పెషల్ స్టేటస్ పై కోట్లాడి మళ్ళీ బీజేపీ తో పొత్తు ఎలా పెట్టుకున్నారని పవన్ ను ప్రశ్నించారు విహెచ్.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
cm revanth reddy
తెలంగాణ DNAలోనే టెక్స్‌టైల్ ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!
tg cabinet meeting
తల్లిదండ్రులను చూడని ఉద్యోగులకు షాక్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions