Sunday 20th April 2025
12:07:03 PM
Home > తాజా > సినిమా చూసి ఎమోషనల్..నటుడిపై మహిళ దాడి

సినిమా చూసి ఎమోషనల్..నటుడిపై మహిళ దాడి

Women Attacks Love Reddy Actor | సినిమాలో ప్రేమ జంటను విడగొట్టడానే కోపంతో ఓ మహిళ చేసిన పని ఇప్పుడు తెగ వైరల్ ( Viral ) గా మారింది. నటుడు అంజన్, నటి శ్రావణి జంటగా తెరకెక్కిన మూవీ లవ్ రెడ్డి ( Love Reddy ). ఈ నెల 18న మూవీ విడుదల అయ్యింది.

ఈ క్రమంలో ప్రేక్షకుల రెస్పాన్స్ ( Responce ) చూద్దామని మూవీ టీం హైదరాబాద్ నిజాంపేటలోని ఓ మల్టీప్లెక్స్ ( Multiplex ) కు వెళ్లారు. సినిమా అయిపోయాక ప్రేక్షకులతో ముచ్చటించ సాగారు. ఇదే సమయంలో ఓ మహిళ సినిమాలో నటించిన ఎన్టీ రామస్వామి ( NT Ramaswamy ) పై దాడికి యత్నించింది.

సినిమా లో ప్రేమ జంటను విడదీస్తావా అంటూ నిలదీసింది. సినిమాలోని సన్నివేశాలు చూసి భావోద్వేగానికి గురైన మహిళ నటుడి కాలర్ పట్టుకుంది. ఈ ఘటనతో అక్కడివారు ఒక్కసారిగా అవాక్కయ్యారు.

వెంటనే హీరో అంజన్, హీరోయిన్ శ్రావణి, దర్శకుడు స్మరన్ రెడ్డి ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మహిళ ఊరుకోలేదు. ఆ మహిళ వెంట వచ్చిన వారు, ఇతరులు కలిసి ఆమెను శాంతిపజేశారు. దింతో మూవీ టీం ఊపిరిపీల్చుకుంది.

You may also like
‘విమానం దారి మళ్లింపు..ఢిల్లీ విమానాశ్రయం సీఎం పై ఆగ్రహం’
‘పెళ్లికూరుతు స్థానంలో ఆమె తల్లి..షాకయిన వరుడు’
‘పిఠాపురంలో దళితులపై గ్రామ బహిష్కరణ’
‘మీ ఆప్యాయతతో నా మనసు ఉప్పొంగింది’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions