Friday 25th July 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > “టీడీపీని పోటీ చేయొద్దని సలహా ఇచ్చిందే పురంధేశ్వరి”

“టీడీపీని పోటీ చేయొద్దని సలహా ఇచ్చిందే పురంధేశ్వరి”

Vijayasai Reddy On Purandeshwari| వైసీపీ ( YCP ) నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ( Vijayasai Reddy ) మరోసారి ఏపీ బీజేపీ ( BJP ) అధ్యక్షురాలు పురందేశ్వరి ( Purandeswari ) పై సంచలన ఆరోపణలు గుప్పించారు.

ఇప్పటికే ఈ ఇరువురు నేతలు మధ్య ఎక్స్ ( Twitter ) వేదికగా ట్వీట్ వార్ ( War ) జరుగుతున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ” తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్ధతుగా టీడీపీ ( TDP ) పోటీ చేయొద్దని సలహా ఇచ్చింది మీరేనంట కదా పురందేశ్వరి గారూ.

మీ అందరి ఆస్తులు, నివాసాలు ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ ( Congress ) ను గెలిపించుకుంటే మీరు అధికారంలో ఉన్నట్టే అని అనుకుంటున్నారట. ఎన్ని విన్యాసాలు చేస్తారమ్మా! బిజెపి గురించి కాక సామాజికవర్గ ప్రయోజనాల కోసం ఆరాటపడుతున్నారు.

” చెల్లెమ్మా పురందేశ్వరి! జిల్లాకు మీ నాన్న పేరు పెట్టిన జగన్ ( Jagan ) గారిని తిట్టడమే పనిగా పెట్టుకొని మీ నాన్నను వెన్నుపోటు పొడిచిన మీ మరిదికి శిక్ష పడకుండా మీరు చేస్తున్న పనిని ఏమంటారో దయచేసి చెప్పగలరా? భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడా?” అంటూ ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.

You may also like
హరిహర వీరమల్లు రిలీజ్.. సీఎం చంద్రబాబు స్పెషల్ విషెస్!
‘మహిళలకు రూ.1500..అమలు చేయాలంటే ఆంధ్రాను అమ్మాలి’
ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలు..నారా భువనేశ్వరి ఆగ్రహం
తోడు కోసం పెళ్లి చేసుకుంటే..భర్త కాదు మోసగాడు !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions