Thursday 14th May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > 10 రోజుల సస్పెన్స్ కి తెర.. కేరళ కొత్త సీఎం ఈయనే!

10 రోజుల సస్పెన్స్ కి తెర.. కేరళ కొత్త సీఎం ఈయనే!

vd satheesan

Keralam New CM | ఇటీవల జరిగిన కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తర్వాత కొత్త సీఎం ఎంపిక విషయంలో సుదీర్ఘ ఉత్కంఠ కొనసాగింది.

ముఖ్యమంత్రి పదవి కోసం మొన్నటి వరకు ప్రతిపక్ష నేతగా ఉన్న వీడీ సతీషన్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, మాజీ ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితాల పేర్లుబలంగా వినిపించాయి. దీంతో సీఎం ఎంపికలో జాప్యం నెలకొంది.

తాజాగా ఆ ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. సీనియర్ కాంగ్రెస్ నేత, గత అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వి.డి. సతీశన్‌ను తదుపరి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. గత 10 రోజులుగా ఢిల్లీ నుంచి కేరళ వరకు మారథాన్ చర్చలు జరిగాయి.

చివరకి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు, రాష్ట్రంలో ఉన్న విశేష ప్రజాదరణ, క్లీన్ ఇమేజ్ సతీశన్‌కు కలిసొచ్చాయి. యువత మరియు తటస్థ ఓటర్లలో ఆయనకున్న క్రేజ్ దృష్ట్యా హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుంది.  

కేరళ కాంగ్రెస్‌లోని వివిధ వర్గాల మధ్య తీవ్రమైన లాబీయింగ్ జరిగినప్పటికీ, అధిష్ఠానం అందరినీ సమన్వయం చేస్తూ సతీశన్ పేరును ప్రకటించింది.

You may also like
Posters on RG
‘కేరళం మీ తప్పును క్షమించదు’.. రాహుల్, ప్రియాంకపై పోస్టర్లు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions