Sunday 30th August 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > వారికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం

వారికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం

TTD News Latest | తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో డిసెంబ‌ర్ 30 నుండి జ‌న‌వ‌రి 8వ తేది వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌కు విచ్చేసే భ‌క్తుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లు చేసిన‌ట్లు టీటీడీ అద‌న‌పు ఈవో సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రి తెలిపారు. తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌ను పుర‌స్క‌రించుకుని విచ్చేసే భ‌క్తుల ర‌ద్దీ దృష్ట్యా డిసెంబ‌ర్ 28 నుండి జ‌న‌వ‌రి 7వ తేది వ‌ర‌కు తిరుప‌తిలోని భూదేవి కాంప్లెక్స్ లో భక్తుల‌కు ఇచ్చే SSD టోకెన్ల జారీని ర‌ద్దు చేయ‌డం జ‌రిగిందని ఈ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకుని భ‌క్తులు సహకరించాలని విజ్ఞ‌ప్తి చేశారు.

అలాగే డిసెంబర్ 30 2025 నుండి జనవరి 8, 2026 వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయన్నారు. తొలి మూడు రోజులు అనగా, డిసెంబర్ 30, 31 మరియు జనవరి 01వ తేదీల్లో ఈ-డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని స్పష్టం చేశారు. టోకెన్ పొందిన భక్తులు తమకు కేటాయించిన తేదీలలో నిర్దేశించిన సమయానికి (Time Slot) మాత్రమే తిరుమలలోని దర్శన ప్రవేశ మార్గాలకు చేరుకోవాలని పేర్కొన్నారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions