Saturday 23rd May 2026
12:07:03 PM
Home > తాజా > మున్సిపల్ ఫలితాలు..గెలుపొందిన ట్రాన్సజెండర్

మున్సిపల్ ఫలితాలు..గెలుపొందిన ట్రాన్సజెండర్

Transgender elected as ward member in Chityala Municipality | తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుండగా, బీఆరెస్ పార్టీ సైతం గట్టి పోటీ ఇస్తుంది. ఇకపోతే నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో ట్రాన్స్ జెండర్ అభ్యర్థి కౌన్సిలర్ గా గెలుపొందారు. ఒకటో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నాగిళ్ళ సుధాకర్ పోటీ చేశారు. తాజగా వెలువడిన ఫలితాల్లో 102 ఓట్ల భారీ తేడాతో ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించారు. ఇకపోతే మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్ర మున్సిపాలిటీలో మరియు సంగారెడ్డి జిల్లా కొహీర్ మున్సిపాలిటీలో హాంగ్ ఫలితాలు వెలువడ్డాయి. అయితే కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా ఈ రెండు మున్సిపాలిటీల్లో నిలిచింది. ఉదయం 11 గంటల వరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ 14 మున్సిపాలిటీలను కైవసం చేసుకోగా బీఆరెస్ 4 చోట్ల గెలుపొందింది.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions