Saturday 7th September 2024
12:07:03 PM
Home > తాజా > నా పేరును వాడుకోవొద్దు.. మోహన్ బాబు వార్నింగ్!

నా పేరును వాడుకోవొద్దు.. మోహన్ బాబు వార్నింగ్!

mohan babu warning

Actor Mohan Babu Warning | ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మంచు మోహన్ బాబు (Mohan Babu) రాజకీయ పార్టీలకు వార్నింగ్ ఇచ్చారు. రాజకీయ నాయకులు, పార్టీలు ఎవరూ తన పేరును వాడుకోవద్దని హెచ్చరించారు.

ఈ మేరకు సోమవారం లేఖను విడుదల చేశారు. ఇటీవల కొందరు తన పేరును రాజకీయంగా ఉపయోగించుకుంటున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు మోహన్ బాబు. దయచేసి ఏ పార్టీ వారైనా వారి వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని సూచించారు.

”మనం అనేక రకాల భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నాం. ఎవరి అభిప్రాయాలు వారివి. అది వారి వారి వ్యక్తిగతం. చేతనైతే నలుగురికి సాయపడడంలోనే మనం దృష్టి పెట్టాలిగాని, సంబంధం లేని వారిని రాజకీయ పార్టీలలోకి, వారి వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధాకరం.” అని పేర్కొన్నారు. అలాగే ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు మోహన్ బాబు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions