Thursday 17th September 2026
12:07:03 PM
Home > క్రీడలు > సూర్యకుమార్ ను వెనక్కునేట్టేసిన తిలక్ వర్మ

సూర్యకుమార్ ను వెనక్కునేట్టేసిన తిలక్ వర్మ

Tilak Varma Surpasses Surya Kumar Yadav | టీం ఇండియా ప్లేయర్ ( Team India Player ), హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ ( Tilak Varma ) అద్భుత ఫీట్ ను సొంతం చేసుకున్నారు.

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో టాప్ 10 లోకి దూసుకొచ్చాడు. ఇటీవల సౌత్ ఆఫ్రికాతో జరిగిన నాలుగు టీ20 మ్యాచుల సిరీస్ లో తిలక్ వర్మ చెలరేగిపోయిన విషయం తెల్సిందే.

వరుసగా రెండు మ్యాచుల్లో సెంచరీలు బాది ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ( Player Of The Series ) గా నిలిచాడు. మొత్తంగా 198 స్ట్రైక్ రేట్ ( Strike Rate ) తో 280 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఏకంగా 69 స్థానాలు ఏకబాకాడు.

సూర్యకుమార్ యాదవ్ ( Surya Kumar Yadav ) ను వెనక్కినెట్టేసి మూడవ స్థానాన్ని దక్కించుకున్నాడు. ట్రావిస్ హెడ్, ఫిల్ సాల్ట్ తొలి రెండు స్థానాల్లో ఉండగా, తిలక్ వర్మ మూడవ స్థానంలో ఉన్నాడు. అలాగే సౌత్ ఆఫ్రికా సిరీస్ లో రెండు సెంచరీలు చేసిన మరో స్టార్ ప్లేయర్ సంజు శాంసన్ 22వ స్థానంలో నిలిచాడు. ఆల్ రౌండర్ విభాగంలో హార్దిక్ పాండ్య అగ్రస్థానంలో ఉన్నారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions