Sunday 20th September 2026
12:07:03 PM
Home > తాజా > ఆ వలలో చిక్కి మీ డబ్బులు పోగొట్టుకోకండి.. పోలీస్ హెచ్చరిక!

ఆ వలలో చిక్కి మీ డబ్బులు పోగొట్టుకోకండి.. పోలీస్ హెచ్చరిక!

police ts

TG Police Warning | ఇటీవల కాలంలో సైబర్ నేరాలు (Cyber Crimes) మితీమీరుతున్నాయి. అమాయకులను టార్గెట్ చేస్తూ డబ్బు ఆశ చూపి లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు సైబర్ నేరగాళ్లు.

ముఖ్యంగా పార్ట్ టైమ్ (Part Time), వర్క్ ఫ్రం హోమ్ (Work From Home) పేరుతో మహిళలను మోసగిస్తున్నారు. తాజాగా సికింద్రబాద్ కు చెందిన ఓ మహిళ నుంచి వర్క్ ఫ్రం హోం, ఆన్ లైన్ ఇన్వెస్ట్ మెంట్ పేరుతో బురిడీ కొట్టించి, రూ 14.5 లక్షలు దోచేశారు.

ఈ నేపథ్యంలో నెటిజన్లకు తెలంగాణ పోలీసులు (Telangana Police) కీలక సూచనలు చేశారు. “పార్ట్ టైమ్ ఉద్యోగం/వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల పేర్లతో మోసపూరిత లింకులు పంపించి మీ బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తారు. లేదా ఉద్యోగం రావాలంటే కొంత అమౌంట్ ముందస్తుగా కట్టాలని మాయమాటలు చెప్తారు. అలాంటి దగాపూరిత వలలో చిక్కి మీ కష్టార్జితాన్ని సైబర్ నేరగాళ్ల పాలు చేయకండి.” అని హెచ్చరించారు పోలీస్.

You may also like
తస్మాత్ జాగ్రత్త.. సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ!
దివ్యాంగుడి కలను నిజం చేసిన మల్కాజిగిరి సీపీ సుమతి!
Digital Arrest
డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.32 కోట్లు కోల్పోయిన మహిళ!
tg police
ఈ తరహా మెసేజ్ లతో జాగ్రత్త.. తెలంగాణ పోలీసుల సూచన!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions