Wednesday 2nd September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > మూడోసారి ప్రధానిగా మోదీ బాధ్యతల స్వీకరణ.. తొలి సంతకం ఎక్కడంటే!

మూడోసారి ప్రధానిగా మోదీ బాధ్యతల స్వీకరణ.. తొలి సంతకం ఎక్కడంటే!

PM Modi

ముచ్చటగా మూడో సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు నరేంద్రమోదీ. ఆదివారం ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెల్సిందే.

ఇదిలా ఉండగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన తొలి సంతకం పీఎం కిసాన్ నిధి విడుదల ఫైలు పై తొలి సంతకం చేశారు.

దీనివల్ల 9 కోట్ల 30 లక్షల పై చిలుకు రైతులకు రూ.20 వేల కోట్ల మేర ప్రయోజనం చేకూరనుంది. ఈ సందర్భంగా స్పందించిన ప్రధాని రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ఇందులో భాగంగానే మొదటి సంతకం రైతుల శ్రేయస్సు కోసం లబ్ది చేకూరే ఫైలు పై సంతకం చేసినట్లు తెలిపారు. రాబోయే కాలంలో రైతులు మరియు వ్యవసాయ రంగానికి మరింత కృషి చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.

You may also like
వెడ్ ఇన్ ఇండియా.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు!
‘ఖేలో ఇండియా డైలాగ్’.. ప్రధాని మోదీ కీలక పిలుపు!
దేశ స్వావలంబనకు 7 సూత్రాల’సప్తధార’: ప్రధాని మోదీ!
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions