Sunday 2nd August 2026
12:07:03 PM
Home > క్రీడలు > ‘ఆస్ట్రేలియాలో సునిల్ గావస్కర్ కు అవమానం’

‘ఆస్ట్రేలియాలో సునిల్ గావస్కర్ కు అవమానం’

Sunil Gavaskar Insulted By Australia Cricket | ఆస్ట్రేలియా దేశంలో సునిల్ గావస్కర్ కు అవమానం జరిగింది.

బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులకు గాను మూడింట్లో గెలిచిన ఆసీస్ ట్రోఫీని కైవసం చేసుకుంది. సిడ్నీ స్టేడియంలో ట్రోఫీని ఆస్ట్రేలియాకి అలన్ బోర్డర్ ప్రెసెంట్ చేశారు. అయితే క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ను మాత్రం ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదు.

ట్రోఫీని ఇస్తున్న సమయంలో గావస్కర్ మైదానంలో ఉన్నారు. అయినప్పటికీ ఆస్ట్రేలియా ఆయన్ను ఆహ్వానించలేదు. సునిల్ గావస్కర్ ఆస్ట్రేలియా క్రికెటర్ అలన్ బోర్డర్ గౌరవార్థం ట్రోఫీకి బోర్డర్-గావస్కర్ అని నామకరణం చేశారు.

కానీ ట్రోఫీని ప్రధానం చేసే కార్యక్రమానికి గావస్కర్ ను ఆహ్వానించకపోవడం తీవ్ర చర్చకు దారి తీసింది. దీనిపై గావస్కర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ఐదవ టెస్టులో ఒకవేళ భారత్ గెలిచినా, లేదా మ్యాచ్ డ్రా అయితేనే మిమ్మల్ని పిలుస్తామని ఒకవేళ ఆస్ట్రేలియా గెలిస్తే మీతో అవసరం లేదని నిర్వహుకులు ముందే చెప్పినట్లు గావస్కర్ చెప్పారు. కేవలం తాను భారతీయుడ్ని కాబట్టే పిలవలేదేమోనన్నారు. బోర్డర్ తో కలిసి ట్రోఫీని అందిస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions