Friday 5th June 2026
12:07:03 PM
Home > క్రీడలు > ‘శ్రీలీల చెయ్యిపట్టి లాగిన ఆకతాయిలు’

‘శ్రీలీల చెయ్యిపట్టి లాగిన ఆకతాయిలు’

Sreeleela News Latest | నటి శ్రీలీలకు చేదు అనుభవం ఎదురైంది. నడుచుకుంటూ వెళ్తున్న ఆమెను కొందరు ఆకతాయిలు చెయ్యిపట్టి లాగేశారు. సెలబ్రెటీలు బయటకు రాగానే కొందరు వారిపై ఎగబడేందుకు ప్రయత్నిస్తుంటారు. వీరి ప్రవర్తన మూలంగా సెలబ్రెటీలు తీవ్ర ఇక్కట్లు పడుతుంటారు.

ఇలాంటి ఘటనే శ్రీలీల కు ఎదురైంది. తెలుగులో వరుస సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైన శ్రీలీల ప్రస్తుతం బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. నటుడు కార్తిక్ ఆర్యన్ తో కలిసి ఓ ప్రేమకథ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ డార్జిలింగ్ లో జరిగింది.

అనంతరం కార్తిక్ ఆర్యన్ తో కలిసి శ్రీలీల ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్నారు. ఇదే సమయంలో పక్కనే ఉన్న ఆకతాయిలు శ్రీలీల చెయ్యి పట్టుకుని పక్కకు లాగే ప్రయత్నం చేశారు.

వెంటనే స్పందించిన బౌన్సర్లు ఆమెను విడిపించారు. ఈ క్రమంలో శ్రీలీల తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఆకతాయిల ప్రవర్తన పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions