Wednesday 5th August 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > సౌత్ సీఎంలే రిచ్.. ఏడీఆర్ (ADR) నివేదికలో ఆసక్తికర అంశాలు!

సౌత్ సీఎంలే రిచ్.. ఏడీఆర్ (ADR) నివేదికలో ఆసక్తికర అంశాలు!

Richest Chief Ministers In India | భారతదేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలపై ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్’ (ADR) నివేదికలు మరియు ఇటీవలి ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా రూపొందించిన గణాంకాలు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

ఉత్తరాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోలిస్తే, దక్షిణాది రాష్ట్రాల సీఎంలే అత్యధిక ఆస్తులను కలిగి ఉన్నట్లు ఈ డేటా స్పష్టం చేస్తోంది.

దక్షిణాది సీఎంల వద్దే రూ. 3,028 కోట్లు..

దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రుల మొత్తం డిక్లేర్డ్ ఆస్తుల విలువ రూ. 3,613 కోట్లు గా ఉంది. ఇందులో అత్యధిక భాగం దక్షిణాది నేతల వద్దే కేంద్రీకృతమై ఉండటం గమనార్హం. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, తెలంగాణ, పుదుచ్చేరి ముఖ్యమంత్రుల ఉమ్మడి ఆస్తుల విలువ రూ. 3,028 కోట్లు.

ఉత్తరాదితో పోలిస్తే 29 రెట్లు ఎక్కువ..

బిహార్,  ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల ముఖ్యమంత్రుల (మొత్తం తొమ్మిది మంది) సంయుక్త ఆస్తుల విలువ కేవలం రూ. 104 కోట్లు మాత్రమే. అంటే, ఉత్తరాది ముఖ్యమంత్రుల కంటే ఆరుగురు దక్షిణాది నేతలు ఏకంగా 29 రెట్లు ఎక్కువ సంపదను కలిగి ఉన్నారు.

కారణాలు ఇవే..

దక్షిణాది రాష్ట్రాల్లో సంపద ఇంతలా కేంద్రీకృతం కావడానికి ప్రధాన కారణం.. గత రెండు దశాబ్దాలుగా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో భూముల విలువలు విపరీతంగా పెరగడమేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత దేశవ్యాప్త ముఖ్యమంత్రుల జాబితాలో కర్ణాటక ముఖ్యమంత్రి అగ్రస్థానంలో నిలిచారు.

ముఖ్యమంత్రి పేరురాష్ట్రంప్రకటించిన ఆస్తుల విలువ
డి.కె. శివకుమార్కర్ణాటకరూ. 1,413 కోట్లు
నారా చంద్రబాబు నాయుడుఆంధ్రప్రదేశ్రూ. 931 కోట్లు
జోసెఫ్ విజయ్తమిళనాడురూ. 648 కోట్లు
ఎ. రేవంత్ రెడ్డితెలంగాణరూ. 30 కోట్లు (రూ. 1 కోటి అప్పులు)
ఎన్. రంగస్వామిపుదుచ్చేరిరూ. 27 కోట్లు

You may also like
ఢిల్లీ చాలా ప్రమాదకరమైన ప్రదేశం.. జాగ్రత్త: మోదీ
యువ జంట ఆదర్శ వివాహం.. కట్నం ఎంతో తెలుసా!
ఇంట్లోకి చొరబడిన చిరుత.. కుక్కతో పాటు లోపల వేసి తాళం వేసిన యజమాని!
ఈ20 ఇంధనం వాడితే బీమా రద్దు..? క్లారిటీ ఇచ్చిన కేంద్రం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions