Saturday 27th July 2024
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > రండి.. ప్రేమించుకోండి.. యూత్ కోసం బ్లైండ్ డేట్స్ నిర్వహిస్తున్న ప్రభుత్వం!

రండి.. ప్రేమించుకోండి.. యూత్ కోసం బ్లైండ్ డేట్స్ నిర్వహిస్తున్న ప్రభుత్వం!

South Korea

Blind Dates | ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో అభివృద్ధిలో ప్రత్యేకతను చాటుకున్న సౌత్ కొరియా తీవ్ర జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

దేశంలో సంతానోత్పత్తి  నానాటికీ క్షీణిస్తోంది. గతేడాది దేశం యొక్క సంతానోత్పత్తి రేటు రికార్డు స్థాయిలో 0.78కి పడిపోయింది, ఇది యునైటెడ్ స్టేట్స్ మరియు జపాన్ కంటే గణనీయంగా తక్కువగా ఉందని గణాంకాలు ఆ దేశాన్ని ఆందోళన పరుస్తున్నాయి.

రోజురోజుకీ ఆర్థిక భారం పెరగడం, పెళ్లిళ్లపై యువతకు ఆసక్తి తగ్గిపోవడమే అందుకు ప్రధాన కారణాలుగా తేలాయి. ఈ నేపథ్యంలోనే దేశంలో జననాల రేటు పెంచేందుకు సౌత్ కొరియా నగరం ఓ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది.

పెళ్లిళ్లపై యువతకు ఆసక్తి పెంచి, పిల్లల్ని కనేలా ప్రోత్సహించడానికి దక్షిణ కొరియాలోని సియోంగ్నామ్‌ నగరం ఒక ప్రత్యేకమైన విధానాన్ని ప్రవేశపెట్టింది. అందే సామూహిక బ్లైండ్ డేట్ ఈవెంట్. క్రిస్మస్ ట్యూన్‌ల నేపథ్యంతో ఈ బ్లైండ్ డేట్ ను ఏర్పాటు చేస్తున్నాయి.

ఈ ఈవెంట్స్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే.. 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న సింగిల్స్ కి ఒక భాగస్వామిని ఎంచుకునే అవకాశం కల్పించడం.

ఒంటరిగా ఉంటూ ప్రేమ కోసం వెతుకున్నవారు వాళ్లు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నవారిని ఒక హోటల్‌ కి ఆహ్వానిస్తారు.

ఒక్కొక్కరికీ ఒక నేమ్ ట్యాగ్ ఇస్తారు. యువతీ యువకుల్ని పక్కపక్కనే నిల్చోబెడతారు. ఆ తర్వాత ఒక రిలేషన్‌షిప్ కోచ్ వచ్చి అనంతరం ‘రాక్-పేపర్-సిజర్’ ఆటని ప్రారంభిస్తాడు.

యువత మధ్య పరిచయాలు పెరిగి, జంటల మధ్య ప్రేమ చిగురించేలా ఆట నిర్వహిస్తారు. దీంతోపాటు రెడ్ వైన్స్‌, చాక్లెట్స్, ఫ్రీ మేకప్ కూడా అందజేస్తారు.

ఈ ఏడాది మొత్తం ఐదు బ్లైండ్ డేట్ ఈవెంట్లు నిర్వహించగా.. 460 మంది పాల్గొన్నారు. ఈవెంట్ కి వచ్చిన 198 మంది ‘జంటలు’గా తిరిగి వెళ్లిపోయారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions