Monday 21st September 2026
12:07:03 PM
Home > తాజా > ‘బీఆరెస్ రజతోత్సవం..కేసీఆర్ కోసం వెండి శాలువా’

‘బీఆరెస్ రజతోత్సవం..కేసీఆర్ కోసం వెండి శాలువా’

Silver-Threaded Shawl for KCR | భారత రాష్ట్ర సమితి 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకలకు భారీ ఏర్పాట్లు చేసింది. వరంగల్ శివారు లోని ఎల్కతుర్తిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొననున్నారు.

ఈ నేపథ్యంలో సిరిసిల్లకు చెందిన హరిప్రసాద్ కేసీఆర్ కోసం ప్రత్యేకంగా వెండి శాలువాను నేసారు. కేసీఆర్ కోసం వెండి పట్టు పోగులతో ప్రత్యేకమైన శాలువా నేసారు.

సిరిసిల్ల పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జిందం చక్రపాణి ఆర్డర్ మేరకు చేనేత కార్మికుడు వెళ్లి హరిప్రసాద్ దాదాపు 5 రోజుల పాటు శ్రమించి వెండి పట్టు దారాలతో కేసీఆర్ ముఖచిత్రం వరంగల్ కాకతీయ కామన్ మరియు సిల్వర్ జూబ్లీ లోగో రెండు వైపుల వచ్చే విధంగా రెండు 32 గ్రాముల వెండి మరియు పట్టు దారంతో రెండున్నర మీటర్ల పొడవు, 46 ఇంచుల వెడల్పుతో శాలువాను రూపొందించారు.

ఈ ప్రత్యేకమైన శాలువాను ఆదివారం వరంగల్ సభలో కేసీఆర్ కి జిందం చక్రపాణి అందించనున్నారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions