Tuesday 12th May 2026
12:07:03 PM
Home > తాజా > నేటి మధ్యాహ్నం రేవంత్ ప్రమాణ స్వీకారం

నేటి మధ్యాహ్నం రేవంత్ ప్రమాణ స్వీకారం

Revanth will take oath today afternoon

-రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం..
-ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న సోనియా, రాహుల్, ప్రియాంక
-స్వాగతం పలికిన రేవంత్‌రెడ్డి

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మరో మూడు గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగనున్న ఈ వేడుకలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి ఆ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ ఈ ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. రేవంత్‌రెడ్డి వారికి స్వాగతం పలికారు. వీరికి పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా రేవంత్ స్వయంగా పలువురు అగ్రనేతలను ఆహ్వానించారు. పక్క రాష్ట్రాల సీఎంలు, పలువురు ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరవుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కూడా వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
cm revanth reddy
తెలంగాణ DNAలోనే టెక్స్‌టైల్ ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!
tg cabinet meeting
తల్లిదండ్రులను చూడని ఉద్యోగులకు షాక్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions