Sunday 23rd August 2026
12:07:03 PM
Home > తాజా > వైరల్ గా మారిన విజయ్-రష్మిక పెళ్లి పత్రిక

వైరల్ గా మారిన విజయ్-రష్మిక పెళ్లి పత్రిక

Rashmika Mandanna and Vijay Deverakonda’s ‘wedding card’ goes viral | నటుడు విజయ్ దేవరకొండ, నటి రష్మిక మందన్న పెళ్లికి సంబంధించి జోరుగా ప్రచారం జయుగుతుంది. తాజగా వీరిద్దరి పెళ్లికి సంబంధించినట్లుగా ఉన్న ఓ పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత కొంతకాలంగా విజయ్-రష్మిక డేటింగ్ లో ఉన్నారని అలాగే ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకోనున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారంపై ఈ ఇద్దరు లేదా వారి కుటుంబ సభ్యుల నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అలా అని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించలేదు. ఈ నేపథ్యంలోనే ఓ పెళ్లి పత్రిక వైరల్ గా మారింది.

రాజస్థాన్ ఉదయ్ పూర్ లో ఫిబ్రవరి 26న విజయ్-రష్మిక వివాహం జరగనున్నట్లు అందులో ఉంది. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఇది జరగనుంది. ఇకపోతే మార్చి 4న మాత్రం హైదరాబాద్ లో అత్యంత వైభవంగా పెళ్లి రిసెప్షన్ వేడుకను నిర్వహించనున్నట్లు సదరు వెడ్డింగ్ కార్డులో ఉంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇకపోతే తాజగా విజయ్ దేవరకొండ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సమయంలో కూడా సీఎంను వివాహానికి ఆహ్వానించడానికే విజయ్ దేవరకొండ కలిశారని కథనాలు వచ్చిన విషయం తెలిసిందే.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions