Monday 9th December 2024
12:07:03 PM
Home > Uncategorized > ‘రామాయణ’పై బిగ్ అప్ డేట్.. విడుదల తేదీని ప్రకటించిన యూనిట్!

‘రామాయణ’పై బిగ్ అప్ డేట్.. విడుదల తేదీని ప్రకటించిన యూనిట్!

ramayana movie

Ramayana Release Date | బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘రామాయణ’ (Ramayana). రాముడిగా రణ్ బీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి, రావణుడి పాత్రలో యశ్ నటిస్తున్న ఈ చిత్రానికి నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు.

బాలీవుడ్ అగ్ర నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ సినిమాకు షూటింగ్ కు సంబంధించిన కొన్ని ఫొటోలు కొద్ది రోజుల కిందట సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి బిగ్ అప్ డేట్ వచ్చింది.

రామాయణ విడుదల తేదిపై యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.  ఈ సినిమా రెండు పార్టులుగా రానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

విడుదల తేదీలను తెలుపుతూ పోస్టర్ విడుదల చేసింది. 2026 దీపావళికి మొదటి భాగం, 2027 దీపావళికి రెండో భాగం విడుదలకానున్నట్లు రామాయణ యూనిట్ వెల్లడించింది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions