Rahul Gandhi Great Nicobar visit | లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం అండమాన్ నికోబార్ లో పర్యటించారు. అందులో భాగంగా దేశంలోనే అత్యంత దక్షిణ కొన అయిన గ్రేట్ నికోబార్ ద్వీపాన్ని సందర్శించారు.
అక్కడ ప్రసిద్ధ లైట్‌హౌస్ (ఇందిరా పాయింట్) వద్ద ఆయన కొద్దిసేపు గడిపారు. 1984, ఫిబ్రవరి 19న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఆమె పర్యటన తర్వాత ఈ ప్రాంతానికి ‘ఇందిరా పాయింట్’ అని పేరు పెట్టారు.
సరిగ్గా 42 ఏళ్ల తర్వాత అదే స్థానంలో నిలబడటం తనకు గర్వంగా ఉందని రాహుల్ పేర్కొన్నారు. భారత సముద్ర తీరాల సౌందర్యం, దేశంలోని భౌగోళిక వైవిధ్యం తనను మంత్రముగ్ధులను చేశాయని, ఈ అద్భుతమైన ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన కొనియాడారు.
కేవలం పర్యటనకే పరిమితం కాకుండా, గ్రేట్ నికోబార్‌లోని గిరిజన కౌన్సిల్ సభ్యులను, స్థానిక ప్రజలను కలిసి అక్కడ ప్రతిపాదించిన రూ. 81,000 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టు వల్ల వారి ఎదుర్కొనే సమస్యలను రాహుల్ అడిగి తెలుసుకున్నారు.
ఇందిరా గాంధీ గారి తర్వాత ఈ మారుమూల ప్రాంతాన్ని సందర్శించిన అత్యున్నత స్థాయి జాతీయ నేతగా రాహుల్ నిలిచారు.







