Saturday 13th June 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > మేం గెలిస్తే రాజీనామా చేస్తారా.. మోదీకి డెరెక్ ఓబ్రియన్ సవాల్!

మేం గెలిస్తే రాజీనామా చేస్తారా.. మోదీకి డెరెక్ ఓబ్రియన్ సవాల్!

Derek O’Brien’s challenge to PM Modi | పశ్చిమ బెంగాల్ చివరి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. టీఎంసీ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓబ్రియన్ నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే సవాల్ విసిరారు.

మే 4న వెలువడబోయే ఫలితాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఘనవిజయం సాధిస్తే, ప్రధాని పదవికి రాజీనామా చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు.

బెంగాల్‌లోని మొత్తం 294 స్థానాలకు తానే అభ్యర్థినని ప్రధాని మోదీ ప్రకటించుకున్నారు. అలాంటప్పుడు ఆ ఓటమికి ఆయనే బాధ్యత వహించాలి.

ఒకవేళ బెంగాల్ ప్రజలు టీఎంసీని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తే.. నైతిక బాధ్యత వహించి మీరు ప్రధానమంత్రి పదవిని వదులుకుంటారా?” అంటూ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

బెంగాల్‌లో టీఎంసీ వర్సెస్ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతున్న తరుణంలో, డెరెక్ ఓబ్రియన్ చేసిన ఈ వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి.

మే 4వ తేదీన వెలువడనున్న ఫలితాలు దేశ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనున్నాయని ఆయన ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions