Sunday 2nd August 2026
12:07:03 PM
Home > క్రీడలు > 408 తేడాతో ఓటమి..టీం ఇండియాకు ఏమైంది!

408 తేడాతో ఓటమి..టీం ఇండియాకు ఏమైంది!

Proteas win first series in IND in 25 years | సౌత్ ఆఫ్రికా జట్టు చేతిలో టీం ఇండియా ఘోర పరాజయం పాలైంది. గౌహతీ వేదికగా జరిగిన రెండవ టెస్టులో ఏకంగా 408 పరుగుల తేడాతో సఫారీ జట్టు ఘన విజయం సాధించింది. కోల్కత్త టెస్టులోనూ సఫారీ జట్టే గెలిచిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో టీం ఇండియాకు వైట్ వాష్ తప్పలేదు. గత 25 సంవత్సరాలలో సఫారీ జట్టు భారత్ వేదికగా టీం ఇండియాను ఓడించి టెస్టు సిరీస్ గెలవడం ఇదే తొలిసారి.

ఓ వైపు సఫారీ బ్యాటర్లు పరుగుల వరదను పారిస్తుంటే మరోవైపు టీం ఇండియా ఆటగాళ్లు మాత్రం తెలిపోయారు. రెండవ ఇన్నింగ్స్ లోనూ జడేజా మినహా మిగిలిన ప్లేయర్లు ఘోరంగా విఫలం అయ్యారు. రెండు వికెట్లు కోల్పోయి 27 పరుగుల ఓవర్నైట్ స్కోర్ తో ఐదవ రోజు ఆటను ప్రారంభించిన టీం ఇండియా 113 పరుగులే చేసి ఏడు వికెట్లను సమర్పించింది. 140 పరుగులకే ఆల్ ఔట్ అయ్యి 408 పరుగుల తేడాతో ఓడిపోయింది. సఫారీ ప్లేయర్లు మాత్రం అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. మార్కో జాన్సన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, హార్మర్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచారు. బ్యాటింగ్, బౌలింగ్ లోనూ ఆధిపత్యం ప్రదర్శించారు. ఈ క్రమంలో అసలు టీం ఇండియాకు ఏమైంది అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీ-20లు, వన్డేలు పక్కన పెడితే టెస్టుల్లో మాత్రం టీం ఇండియా ఘోరంగా విఫలం అవుతుంది. దీనికి కారణాలను విశ్లేషించి మెరుగైన ప్రదర్శనతో టీం ఇండియా బలంగా ముందుకు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions