Ponguleti Srinivas Reddy | తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
మొన్నటి వరకు అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య ధోరణితో కొట్టుమిట్టాడిన కాంగ్రెస్ పార్టీ తన జోరు పెంచింది.
రేవంత్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఊపందుకున్న పార్టీలో, కర్ణాటక ఫలితాలతో మరింత ఉత్తేజం వచ్చింది.
తాజాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి క్రిష్ణారావుతో పాటు 33 మంది నాయకులు కాంగ్రెస్ లోకి చేరేందుకు సిద్ధమయ్యారు.
తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం పొంగులేటి, జూపల్లి వివిధ స్థాయికి చెందిన 33 మంది లీడర్లు ఢిల్లీ లో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఎంపీ రాహుల్ గాంధీ తో సమావేశం అయ్యారు.
తదనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ సమక్షయంలో జులై 2 న ఖమ్మం సభలో వీరంతా కాంగ్రెస్ పార్టీ లో చేరనున్నారని ప్రకటించారు.
కర్ణాటక అసెంబ్లీ ఫలితాల తర్వాత జోరు పెంచింన కాంగ్రెస్ ఇతర పార్టీ నాయకులని ఆహ్వానిస్తున్నారు.
అందులో భాగంగా బీఆరెస్ నుండి బహిష్కరించబడిన జూపల్లి, పొంగులేటి కోసం కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం సఫలం అయ్యింది అనే చెప్పాలి.
పొంగులేటి, జూపల్లి చేరిక
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, క్యాంపెయింగ్ చైర్మయిన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ విబేధాలు పక్కన పెట్టి వీరిద్దరని తమ పార్టీ లోకి తీసుకురావడానికి యత్నించారు.
పొంగులేటి , జూపల్లి ల ఇంటికి వెళ్లి వారిని పార్టీ లోకి ఆహ్వానించారు.
అలాగే రాహుల్ గాంధీ టీం కూడా వీళ్లిదరిని కాంగ్రెస్ లోకి తీసుకురావడానికి చాలా సార్లు చర్చలు జరిపి వారికి నచ్చచెప్పి కాంగ్రెస్ లోకి రావడానికి సహకరించింది.
అలాగే పొంగులేటి, జూపల్లి తమ సొంత సర్వేలు, కార్యకర్తల అభిప్రాయం మేరకు కాంగ్రెస్ లోకి వెళ్లనున్నారు.
తెలంగాణ రాజకీయాలపై ప్రభావం..
పొంగులేటి, జూపల్లి నేతల చేరిక ప్రకటనతో కాంగ్రెస్ లో కొత్త జోష్ వచ్చింది.
కేవలం వీరిద్దరే కాకుండా వీరితో పాటు మొత్తం 35 మంది నాయకులు జులై 2 న కాంగ్రెస్ లోకి వెళ్లనున్నారు.
జూపల్లి మాజీ మంత్రి గా చాలా అనుభవం గల నాయకుడు. అదేవిధంగా పొంగులేటి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తన ప్రభావాన్ని చూపగలరు.
ఆ జిల్లాలో 10 నియోజకవర్గాల్లో తనకంటూ సొంత బలగం కలిగిన వ్యక్తి. అలాగే చతురంగ బలగాలు కలిగిన వ్యక్తి.
తాజా చేరికలతో బీఆరెస్ కి ప్రత్యర్థి గా కాంగ్రెస్ పార్టీనే అనే భావన తెలంగాణ సమాజం లో ఏర్పడే అవకాశం మెండుగా ఉంది. మరోవైవు బీజేపీ లుకలుకలతో సతమతమవుతుంది.
ఈటెల, కోమటిరెడ్డి లు అమిత్ షా తో సమావేశం అనంతరం కూడా అసంతృప్తిగానే ఉన్నారు అని తెలుస్తుంది.
ఒకవైపు కాంగ్రెస్ చేరికలతో దూసుకుపోతుంటే, బీజేపీ డీలా పడటం ఆశ్చర్యంగా ఉంది. మరి బీఆరెస్ ఏ విధంగా స్పందిస్తుందో, కాంగ్రెస్ ని ఏ విధంగా ఎదుర్కుంటుందో చూడాలి.