Tuesday 4th August 2026
12:07:03 PM
Home > తాజా > N CONVENTION కూల్చివేత.. నాగార్జున హాట్ కామెంట్స్!

N CONVENTION కూల్చివేత.. నాగార్జున హాట్ కామెంట్స్!

nagarjuna akkineni

Nagarjuna Responds Over N Convention Demolition | నటుడు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)కు చెందిన ఎన్ కన్వెన్షన్ (N Convention)ను హైడ్రా (HYDRA) అధికారులు శనివారం ఉదయం కూల్చివేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో స్పందించిన నాగార్జున హాట్ కామెంట్స్ చేశారు.

కోర్టు కేసులు, స్టే ఆర్డర్లు ఉన్న నేపథ్యంలో చట్టవిరుద్దంగా కన్వెన్షన్ ను కూల్చివేయడం బాధాకరమని నాగార్జున తెలిపారు. తన ప్రతిష్టను కాపాడుకోవడం కోసం, వాస్తవాలను తెలియజేయడానికి మరియు చట్టాన్ని ఉల్లంఘించేలా తాను ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదని స్పష్టం చేశారు.

కన్వెన్షన్ ఉన్న భూమి పట్టా భూమి అని తెలిపారు. ఒక్క అంగుళం కూడా చెరువు భూమిని ఆక్రమించలేదన్నారు. శనివారం ఉదయం కూల్చివేతకు ముందు ఎటువంటి నోటీసులు జారీ చేయలేదని పేర్కొన్నారు. అలాగే కూల్చివేత తప్పుగా జరిగిందని చెప్పారు.

చట్టాన్ని గౌరవించే పౌరుడిగా తనకు వ్యతిరేకంగా కోర్టు తీర్పును ఇస్తే, తానే నిర్మాణాన్ని కూల్చివేసే వాడినని నాగార్జున పోస్ట్ చేశారు. అక్రమ నిర్మాణాలు, ఆక్రమణ గురించి ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించాలనే ఉద్దేశ్యంతోనే ఈ ప్రకటన చేస్తున్నట్లు నాగార్జున ప్రకటించారు.

అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు అక్కడ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు నాగార్జున ధీమా వ్యక్తం చేశారు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
హైడ్రా పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions