Wednesday 16th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > బ్రెజిల్ వేదికగా మరోసారి కలిసిన మోదీ-మెలోని

బ్రెజిల్ వేదికగా మరోసారి కలిసిన మోదీ-మెలోని

Pm Modi Meets Italy Pm Meloni | భారత ప్రధాని నరేంద్రమోదీ ( PM Modi ), ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ( Giorgia Meloni ) కలిశారు. వీరిద్దరూ ఎప్పుడూ కలిసినా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ ( Trending ) అవుతుంది. వీరిద్దరి స్నేహానికి మెలోనీ + మోదీ, మెలోడీ ( Melody ) అని నామకరణం చేశారు ఇటలీ ప్రధాని.

ప్రస్తుతం బ్రెజిల్ ( Brazil ) దేశం వేదికగా జీ20 శిఖరాగ్ర సదస్సు జరుగుతుంది. ఈ సందర్భంగా మోదీ, మెలోనీ భేటీ అయ్యారు. ప్రస్తుతం ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. రక్షణ, భద్రత, వాణిజ్య, సాంకేతిక అంశాల గురించి చర్చించినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు.

భారత్ ఇటలీ మధ్య సంబంధాలు మెరుగైన ప్రపంచానికి దోహద పడతాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ప్రధాని మోదీతో భేటీ అవ్వడం పట్ల ఇటలీ ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మెలోడీ మూమెంట్ ( Melody Moment ) వైరల్ గా మారింది.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions