Sunday 19th April 2026
12:07:03 PM
Home > క్రీడలు > SRH ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. హైదరాబాద్‌కు వచ్చేస్తున్న ప్యాట్ కమిన్స్!

SRH ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. హైదరాబాద్‌కు వచ్చేస్తున్న ప్యాట్ కమిన్స్!

pat cummins

Pat Cummins Return To SRH | ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ (SRH) జట్టుకు భారీ ఊరట లభించింది. గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్‌లకు దూరమైన స్టార్ బౌలర్, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మళ్ళీ జట్టుతో చేరబోతున్నట్లు సమాచారం. కమిన్స్ రాకతో హైదరాబాద్ బౌలింగ్ విభాగం మరింత బలోపేతం కానుంది.

ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్..
ఐపీఎల్ ప్రారంభానికి ముందే గాయపడిన కమిన్స్, టోర్నీ మధ్యలో చికిత్స కోసం ఆస్ట్రేలియా వెళ్లిన విషయం తెలిసిందే.

బుధవారం క్రికెట్ ఆస్ట్రేలియా కమిన్స్‌ కు ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించనుంది. ఈ టెస్టులో కమిన్స్ నెగ్గడం దాదాపు ఖాయం కావడంతో, ఆయన ఏప్రిల్ 17న భారత్‌కు చేరుకుని నేరుగా హైదరాబాద్ జట్టుతో కలవనున్నారు.

బౌలింగ్ అటాక్ ‘డబుల్’ పవర్.. ఇటీవల రాజస్థాన్ రాయల్స్‌ తో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన యువ బౌలర్లు ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడ్డారు.
ముఖ్యంగా ప్రఫుల్ మొదటి ఓవర్లోనే 3 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు కమిన్స్ లాంటి సీనియర్ బౌలర్ వీరితో చేరితే, SRH డెత్ ఓవర్ల బౌలింగ్ తిరుగులేకుండా మారుతుంది.

ఇషాన్ కిషన్‌కు ఒత్తిడి దూరం..
కమిన్స్ గైర్హాజరీలో ప్రస్తుతం ఇషాన్ కిషన్ జట్టును విజయవంతంగా నడిపిస్తున్నారు. అయితే, కమిన్స్ తిరిగి సారథ్య బాధ్యతలు చేపడితే, ఇషాన్ పూర్తిస్థాయిలో తన బ్యాటింగ్ మీద దృష్టి సారించి మరింత దూకుడుగా ఆడే అవకాశం ఉంటుంది. ఆరెంజ్ ఆర్మీని మళ్ళీ ప్లేఆఫ్స్ వైపు నడిపించేందుకు కమిన్స్ రాక ఎంతో కీలకం కానుంది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions