Wednesday 16th September 2026
12:07:03 PM
Home > తాజా > తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి..కాల్పుల కలకలం

తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి..కాల్పుల కలకలం

MLC Teenmar Mallanna’s office vandalised over remarks on Kavitha | తెలంగాణ శాసనామండలి సభ్యుడు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కు చెందిన ఆఫీసు పై ఆదివారం దాడి జరగడం సంచలనంగా మారింది.

బీఆరెస్ ఎమ్మెల్సీ కవితకు చెందిన జాగృతి కార్యకర్తలు, ఆమె అనుచరులు హైదరాబాద్ మేడిపల్లిలోని తీన్మార్ మల్లన్న కార్యాలయంలోకి దూసుకువచ్చి దాడికి యత్నించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

కవితపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారని జాగృతి నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి నేపథ్యంలో ఆఫీసు ఫర్నిచర్ ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వారిని అడ్డుకునేందుకు తీన్మార్ మల్లన్న గన్ మెన్ ఐదు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు.

దింతో అక్కడ భీతావహ పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా కవిత బీసీ రిజర్వేషన్ల కోసం చేస్తున్న ఉద్యమాన్ని కించపరిచే విధంగా మల్లన్న వ్యాఖ్యలు చేశారని జాగృతి కార్యకర్తలు మండిపడుతున్నారు. అలాగే కవితపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions