Wednesday 16th September 2026
12:07:03 PM
Home > తాజా > తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై మండలి ఛైర్మన్ కు కవిత ఫిర్యాదు

తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై మండలి ఛైర్మన్ కు కవిత ఫిర్యాదు

Kavitha Demands Action Against Teenmar Mallanna Telangana | ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పై శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఆదివారం ఫిర్యాదు చేశారు బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత.

మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలు తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయని పేర్కొన్నారు. దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని తాను ఎన్నో ఏళ్లుగా ఉద్యమాలు చేస్తున్నట్లు చెప్పారు.

చట్టసభలో సభ్యురాలైన తనపైనే మల్లన్న అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తే, సమాజంలోని సామాన్య మహిళల విషయంలో ఆయన ఎలాంటి అభిప్రాయంతో ఉంటారో అర్ధం చేసుకోవచ్చన్నారు.

ఈ సందర్భంగా మల్లన్నను అరెస్ట్ చేయాలని కవిత డిమాండ్ చేశారు. ఆయన్ను అరెస్ట్ చేయకపోతే ముఖ్యమంత్రి ని కూడా అనుమానించాల్సి వస్తుందని పేర్కొన్నారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions