Saturday 17th October 2026
12:07:03 PM
Home > క్రీడలు > అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ గుడ్‌బై!

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ గుడ్‌బై!

  • ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా రిటైర్మెంట్ ప్రకటన!

Lionel Messi Retires From International Football అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత 20 ఏళ్లుగా జాతీయ జట్టుకు ఎనలేని సేవలు అందించిన ఈ లెజెండరీ ఆటగాడు, తన అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు స్వయంగా వెల్లడించారు.

ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మెస్సీ భావోద్వేగ సందేశం..

తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ಖాతా వేదికగా మెస్సీ ఈ నిర్ణయాన్ని అభిమానులతో పంచుకున్నారు. “ఈ నిర్ణయం తీసుకోవడం ఎంతో బాధ కలిగిస్తున్నప్పటికీ.. నా కెరీర్‌లో ఇది సరైన సమయం మరియు సరైన నిర్ణయం” అని మెస్సీ పేర్కొన్నారు. గత రెండు దశాబ్దాలుగా (20 ఏళ్లుగా) తనపై చూపించిన అపారమైన ప్రేమ, మద్దతుకు అభిమానులకు మరియు దేశ ప్రజలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

విషాదంలో ఫుట్‌బాల్ ప్రపంచం..

అర్జెంటీనాకు ప్రతిష్టాత్మక వరల్డ్ కప్‌తో పాటు ఎన్నో చారిత్రాత్మక విజయాలు, మైలురాళ్లను అందించిన మెస్సీ నిష్క్రమణతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ ప్రేమికులు, అభిమానులు తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు.

You may also like
ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం!
బ్రెజిల్, ఉరుగ్వే, పనామాతో భారత్ ఫుట్ బాల్ జట్టు సమరం!
‘ఖేలో ఇండియా డైలాగ్’.. ప్రధాని మోదీ కీలక పిలుపు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions