Monday 4th May 2026
12:07:03 PM
Home > తాజా > ‘ఎవనిదిరా కుట్ర? ఏంది ఆ కుట్ర ‘: కేటీఆర్

‘ఎవనిదిరా కుట్ర? ఏంది ఆ కుట్ర ‘: కేటీఆర్

ktr comments

KTR Tweet | వికారాబాద్ కలెక్టర్ (Vikarabad Collector) పై దాడి కేసులో ఇప్పటికే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి (Patnam Narender Reddy)ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. ఇదే కేసులో బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)పై కూడా చర్యలు తీసుకుంటారని కథనాలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో స్పందించిన కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ ఎవనిదిరా కుట్ర? ఏంది ఆ కుట్ర? నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా? నీ అల్లుని కోసమో, అన్న కోసమో…

రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా?
గత తొమ్మిది నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకు ఈడ్వడం కుట్ర కాదా? నీ ప్రైవేట్‌‌ సైన్యంతో తండ్రిని కొడుక్కి, బిడ్డను తల్లికి, భార్యను భర్తకి దూరం చెయ్యడం ఎవరి కుట్ర? పేద లంబాడా రైతులను బూతులు తిట్టి, బెదిరించింది ఎవరి కుట్ర? ఎవని కోసం కుట్ర! మర్లపడ రైతులు, ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర?

50 లక్షల బ్యగులతో దొరికిన దొంగలకు, రైతు కష్టం కుట్రగా కాక ఎలా కనిపిస్తుంది? నన్ను ఏదో ఒక కేసులో నువ్వు ఇరికించి అరెస్ట్ చేస్తావని ఎప్పుడో తెలుసు! రైతుల గొంతైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా పోతాను! నీ కుట్రలకు భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరు. చేసుకో అరెస్ట్ రేవంత్‌ రెడ్డి! చూద్దువుగాని నిజానికి ఉన్న దమ్మేంటో!!!’ అంటూ కేటీఆర్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

You may also like
azharuddin and kodandaram as mlc
ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాంప్రమాణ స్వీకారం.. మంత్రి పదవికి వీడిన గండం!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!
tgspdcl
ఏప్రిల్ 8 నుంచి విద్యుత్ ఆర్టిసన్ల నిరవధిక సమ్మె!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions