Saturday 2nd December 2023
12:07:03 PM
Home > తెలంగాణ > ‘ఆ చార్జీలు పూర్తిగా రద్దు చేస్తాం..’ సీఎం కేసీఆర్ తీపి కబురు..!

‘ఆ చార్జీలు పూర్తిగా రద్దు చేస్తాం..’ సీఎం కేసీఆర్ తీపి కబురు..!

kcr speec today

KCR Speech Today | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆరెస్ అధినేత కేసీఆర్ (KCR) మరో కీలక హామీ ఇచ్చారు.

సోమవారం మానకొండూరు, స్టేషన్ ఘనపూర్, నకిరేకల్, నల్గొండ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు గులాబీ బాస్.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మరోమారు బీఆరెస్ (BRS Party) అధికారంలోకి రాగానే ఆటోలకు సంబంధించి ఫిట్నెస్, సెర్టిఫికెట్ చార్జీలను మాఫీ చేస్తామని హామీనిచ్చారు.

KCR Speech Today మోదీ (Modi) అధికారంలోకి వచ్చాక డీజిల్, పెట్రోల్ ధరలను పెంచడంతో ఆటో నడుపుకునే వారు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు కేసీఆర్.

అలాగే దేశ వ్యాప్తంగా ఆటోలకు టాక్స్ విధిస్తారని, కానీ తాము అధికారంలోకి రాగానే ఆ టాక్స్ (Tax) ను రద్దు చేసినట్లు గుర్తు చేశారు ఆయన.

ఎన్నికలు అయిన మరునాడే ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని స్పష్టం చేశారు. రైతు రుణమాఫీ దాదాపు 90 శాతం అయిపోయిందని, రూ. లక్ష వరకు రుణమాఫీ అయ్యిందని తెలిపారు.

మిగిలిన నాలుగైదు శాతం వారికి కూడా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అస్సలు రుణమాఫీ కాకుండా అడ్డుపడిందే కాంగ్రెస్ (congress) నాయకులని ఆరోపించారు కేసీఆర్.

You may also like
uttam kumar press meet
“అసైన్డ్ భూముల రికార్డులు మారుస్తున్నారు..”
sharmila
కేసీఆర్ కు ఒక గిఫ్ట్ ఇస్తున్నాం.. వైఎస్ షర్మిల సెటైర్లు!
congress party
“అక్రమంగా ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్లు..”
gutha sukhendar reddy
ఇది దురాక్రమణ.. ఏపీ సర్కార్ పై గుత్తా విమర్శలు! 

Leave a Reply

Designed & Developed By KBK Business Solutions