Sunday 23rd August 2026
12:07:03 PM
Home > తాజా > వాలెంటైన్స్ డే..వలపు వలలో పడొద్దు!

వాలెంటైన్స్ డే..వలపు వలలో పడొద్దు!

Hyderabad CP Sajjanar warns youth ahead of Valentine’s day | వాలెంటైన్స్ డే సమయంలో సోషల్ మీడియాలో సైబర్ నేరగాళ్లు వేసే వలపు వలలో పడొద్దని హెచ్చరించారు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్. వాలెంటైన్స్ డే అంటే కేవలం గులాబీలే కాదు ప్రమాద ఘంటికలు కూడా! సోషల్ మీడియా, డేటింగ్ యాప్స్‌లో తోడు కోసం వెతుకుతుంటే, సైబర్ కేటుగాళ్లు మాత్రం బ్యాంక్ ఖాతాను ఖాళీ చేయడానికి కాచుకుని ఉంటారు. పరిచయం అయిన వెంటనే ‘ఐ లవ్ యూ’ చెప్పడం, విదేశాల్లో ఉన్నామంటూ గొప్పలు చెప్పడం, హఠాత్తుగా ఆపద వచ్చిందని నాటకాలాడటం ఇవన్నీ బుట్టలో వేసుకునే ఎత్తుగడలే అని పేర్కొన్నారు సజ్జనర్.

అజ్ఞాత వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు, గిఫ్ట్ కార్డులు పంపొద్దని సూచించారు. వీసా సమస్యలని, ఆసుపత్రి ఖర్చులని, కస్టమ్స్‌లో ఖరీదైన ‘గిఫ్ట్’ ఇరుక్కుపోయిందంటూ చెప్పే మాయమాటలు అస్సలు నమ్మొద్దని అప్రమత్తం చేశారు. అనుమానం వస్తే వెంటనే స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడాలని ప్రేమ కోసం వేచి చూడొచ్చు.. కానీ మోసగాళ్ల చేతిలో చిక్కి విలపించొద్దని సజ్జనర్ స్పష్టం చేశారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions